Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి

విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి

- Advertisement -

నవతెలంగాణ – భూపాలపల్లి: విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన భూపాలపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం  చోటుచేసుకుంది. బాధితుడు యాస శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం… రోజు మాదిరిగానే తనకున్నటువంటి ఎద్దు రోజూ మాదిరిగానే గ్రామ సమీపంలో మేతకు వెళ్ళింది. 11 కెవి ట్రాన్స్ఫారం వద్ద మేతమస్తుండగా వైరు తగిలి షాక్ తో  అక్కడికక్కడే మృతి చెందిందని విలపించాడు.  వర్షాకాలం భూమి సాగుచేసే సమయంలో ఎద్దు మృతి చెందడాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నాడు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -