– గాలికుంటు వ్యాధి నివారణ ప్రచార రథంలో డాక్టర్ రాజేశ్ కుమార్
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండలంలోని అన్ని గ్రామాల్లోని పాడి రైతులు, పశుపోషకులు మూగజీవాలకు గాలికుంటూ నివారణ టీకాలు తప్పనిసరి వేయించుకోవాలని మండల పశువైద్య అధికారి డాక్టర్ రాజేశ్ కుమార్ అన్నారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలో గాలికుంటు వ్యాధి నివారణ ప్రచార రథం ఊరుకొండ మండలానికి వచ్చిన సందర్భంగా మండల పశువైద్య అధికారి డాక్టర్ రాజేశ్ కుమార్ మాట్లాడారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల పాడి రైతులు తమ మూగ జీవాలకు తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్య్రమాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మూగజీవాలకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



