Thursday, May 15, 2025
Homeతెలంగాణ రౌండప్పీర్జాదిగూడ కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా దుర్గా

పీర్జాదిగూడ కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా దుర్గా

- Advertisement -

నవతెలంగాణ – బోడుప్పల్
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్ఎన్ కే దుర్గా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితా రావు, జిల్లా అధ్యక్షురాలు రాజమణిల చేతుల మీదుగా గాందీ భవన్ లో నియామక పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా దుర్గా మాట్లాడుతూ ..తనపై నమ్మకంతో పీర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళ సంక్షేమం కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్ళి పార్టీని మరింతగా బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్దన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -