Sunday, May 11, 2025
Homeతెలంగాణ రౌండప్పాక్ యుద్ధం వేళ.. అందాల పోటీలు అవసరమా..

పాక్ యుద్ధం వేళ.. అందాల పోటీలు అవసరమా..

- Advertisement -

పూస శ్రీనివాస్..
నవతెలంగాణ – భువనగిరి
: పాకిస్తాన్తో యుద్ధం వేల మన రాష్ట్రంలో విష సంస్కృతిని వ్యాపింపచేసే అందాల పోటీలో అవసరమా అని శివసేన రాష్ట్ర కార్యదర్శి పూస శ్రీనివాస్ ప్రశ్నించారు. శనివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  యుద్ధ వాతావరణం వేళ అందాల పోటీలో అవసరమా వెంటనే అందాల పోటీలో రద్దు చెయ్యాలి అని డిమాండ్ చేశారు.  దేశంలో క్రికెట్ పోటీలను బీసీసీ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో మూడు అంచల భద్రత పెట్టి విపత్కర పరిస్థితుల్లో ఆడవాళ్లను కించపరిచే పోటీలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు.  ప్రపంచమంతా భారతదేశాన్ని కి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మద్దతు పలుకుతుంటే మన రాష్ట్ర ప్రజలు అందాలు పోటీలు చూసుకుంటూ ఉండాల్నా ఇది ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు. మహిళను కించపరచడంతోపాటు విపత్కర పరిస్థితులలో ఈ పోటీలో నిర్వహిస్తే  అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వము అందాల పోటీలను కాకుండా ప్రస్తుత రాష్ట్రంలో యువత గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం కావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శివ,శేఖర్ హరి కాంత్, మధు, రతన్ లాల్, సత్తి గౌడ్  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -