- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో శ్రీ వాగ్దేవి విద్యాలయంలో ముందస్తుగా శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్స్ కొలిపాక రాజకుమార్, బూడిద సదానందం తెలిపారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. బతుకమ్మ..బతుకమ్మ అంటూ సందడి చేశారు. సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని కరస్పాండెంట్స్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -