- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేపు ఈసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. రేపు సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశమున్నట్టు సమాచారం.
- Advertisement -