Friday, November 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్థిక, సామాజిక సర్వే

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్థిక, సామాజిక సర్వే

- Advertisement -

పాలకవర్గాల్లేక ఎక్కడి సమస్యలు అక్కడే..
అడ్డగూడూరు మండలంలో సర్వేను ప్రారంభించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌


నవతెలంగాణ- అడ్డగూడూరు
గ్రామాల్లో సమస్యలతోపాటు ఆర్థిక, సామాజిక కుటుంబ స్థితిగతులను తెలుసుకునేందుకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మొదటి విడత సర్వే ప్రారంభమైంది. ఈ క్రమంలో గురువారం పలు జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలు సర్వే నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీ దేవికాల్వ గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామీణ ఆర్థిక, సామాజిక కుటుంబ సర్వేను జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పాలకవర్గాలు లేక సుమారు 10 నెలలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకుండా.. ప్రభుత్వం స్పెషల్‌ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తూ కాలం గడుపుతోందని, సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతోందని విమర్శించారు. గ్రామాల్లో దళితులు సేద్యం చేసుకుంటున్న 492 సర్వే నెంబర్‌లో ఉన్న భూమిలో వారికి పక్కా పట్టాలు ఇచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే గ్రామంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, గ్రామంలో సబ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించాలని కోరారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, తాము గ్రామాల్లో ప్రతి గడపకూ పోయినపుడు ప్రజలు చెబుతున్న బాధ వర్ణనాతీతంగా ఉందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 గ్రామాల్లో ఆర్థిక, సామాజిక కుటుంబ సర్వే మొదటి విడతగా నిర్వహిస్తున్నామని, వెలుగులోకి వచ్చిన సమస్యలను క్రోడీకరించి.. మళ్లీ రెండో విడత సర్వే నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముట్టడి చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి బుర్రు అనిల్‌ కుమార్‌, శాఖ కార్యదర్శి బండి నర్సింహాస్వామి, ఆకుల సోమల్లు, మామిడ్ల నర్సయ్య, యాదగిరి, బొమ్మగాని వీరయ్య, కన్నెబోయిన సోమయ్య, బండి యాదయ్య, పనుమాటి నాగయ్య, బీనబోయిన భద్రయ్య, బండి నర్సింహాస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -