- Advertisement -
నవతెలంగాణ – వీర్నపల్లి : వీర్నపల్లి మండలం బంజేరు గ్రామంలో మహిళ పాల ఉత్పత్తి దారుల సంస్థ కు కరీంనగర్ డైరీ తరుపున పాల క్యాన్, బ్యాగులు డైరీ జనరల్ మేనేజర్ రామరాజు, మహిళ రైతులకు అందించారు. వ్యవసాయానికి అనుబంధంగా పశు సంరక్షణ చేసుకున్నట్లయితే కుటుంబం పాడి పంటలతో అభివృద్ధి చెందుతుందని రైతులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్రహారం ఎం సి సి మేనేజర్ రవీందర్,అసిస్టెంట్ మేనేజర్ రాజిరెడ్డి సూపర్వైజర్ నాగరాజు, పాల సంస్థ అధ్యక్షులు లక్ష్మీ, మాజీ సర్పంచ్ కళ నాయకులు రవి నాయక్, వీర్నపల్లి డైరీ అధ్యక్షులు లింబాద్రి,నాయకులు దేవ రాజు, గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



