- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నగరంలో లగ్జరీ కార్ల విక్రయాల డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు, కార్యాలయంతో పాటు అతని స్నేహితుల ఇండ్లలో ఈడీ సోదాలు ముగిశాయి. దాదాపు 6 గంటలకుపైగా అధికారులు సోదాలు నిర్వహించారు. ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్‌ను ఇప్పటికే అహ్మదాబాద్ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. రాజకీయ నాయకులు, వ్యాపారులకు ఆయన లగ్జరీ కార్లు అమ్మినట్టు ఈడీ గుర్తించింది. విదేశాల నుంచి తెచ్చిన కార్లకు పన్ను ఎగవేత ఆరోపణలతో ఈడీ సోదాలు చేపట్టింది. బసరత్ ఖాన్ ఎవరికి కార్లు విక్రయించారనే దానిపై కూడా ఈడీ అధికారులు ఆరా తీశారు. రూ.కోట్ల మేర కస్టమ్స్ మోసం కేసులో గతంలోనూ బసరత్ ఖాన్ అరెస్టయ్యారు.
- Advertisement -