Saturday, October 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యా కమిటీలపై చర్చించాలి

విద్యా కమిటీలపై చర్చించాలి

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యానాణ్యతను పెంపొందించేందుకు పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించడం మంచి విషయం. కానీ, దీనికి టీచర్లనే నియమించడం పట్ల భిన్నా భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ టీచర్ల (కమిటీల)ను తనిఖీ బృందాలుగా రంగంలోకి దింపేందుకు సర్కార్‌ సిద్ధమవుతోంది. ప్రతి వంద ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒకటి చొప్పున, ప్రతి యాభై ఉన్నత పాఠశాలలకు ఒక కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకు నిర్దేశిత లక్ష్యాలను సాధించడం, ప్రతి వారం డీఈఓలకు నివేదికలు అంది ంచడం వంటి బాధ్యతలు చూసేలా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 16,474 ప్రాథమిక పాఠశాలలకు 168 కమిటీలు, 3,100 ప్రాథమికోన్నత పాఠశాలలకు 35 కమిటీలు, 4,672 ఉన్నత పాఠశాలలకు 96 కమిటీలు ఏర్పాటు కానున్నాయి.

ప్రాథమిక కమిటీలకు హెచ్‌ఎంలు, ప్రాథమికోన్నత పాఠశాల కమిటీలకు స్కూల్‌ అసిస్టెంట్లు నోడల్‌ అధికారులుగా ఉంటారు. హైస్కూల్‌ కమిటీలకు గెజిటెడ్‌ హెచ్‌ఎంలు నాయకత్వం వహించనున్నారు. ఈ కమిటీల్లో సబ్జెక్ట్‌ టీచర్లు, పీఈటీలు సభ్యులుగా వ్యవ హరిస్తారు. ఈ కమిటీల నియామకం గత మేనెలలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, ఉపాధ్యాయ సంఘాల వ్యతి రేకతతో నిలిపి వేయబడింది. అప్పట్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు కలిపి ఒకే కమిటీ ఏర్పాటు చేసి, దానికి స్కూల్‌ అసిస్టెంట్‌ను నోడల్‌ అధికారిగా నియమించడం వివాదాస్పదమైంది. ”జూనియర్‌ టీచర్లు సీనియర్లను ఎలా పర్యవేక్షిస్తారు?” అనే ప్రశ్నలతో చర్చ చెలరేగింది. ఫలితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈసారి మాత్రం వేర్వేరు స్థాయిలకు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేస్తూ, ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసింది.

ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించాలనే ప్రభుత్వ ఉద్దేశం ప్రశంసనీయమే. అయితే, ప్రస్తుతం విద్యాశాఖలో వివిధ కేటగిరీల్లో డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, పీజీ హెచ్‌ఎంలు, పిఎస్‌ హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు, పండిట్లు, ఎస్జీటీలు, పీఈటీలు, క్రాఫ్ట్‌ టీచర్లు వంటి పోస్టులు సుమారు ఇరవై వేలకు పైగా ఖాళీగా ఉన్నా యని సమాచారం. ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల బోధన, పర్యవేక్షణ రెండింటిలోనూ లోపాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే బోధనా భారంతో నిండిన ఉపాధ్యాయుల భుజాలపై పర్యవేక్షణ బాధ్యతలు కూడా వేయడం ఆందోళన కలిగిస్తోంది.

బోధనాభ్యసన నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. ఖాళీలను ముందుగా భర్తీ చేసి, తర్వాత ఈ కమిటీ విధానాన్ని అమలు చేస్తే మరింత సానుకూల ఫలితాలు సాధ్యమవు తాయి.అంతేకాకుండా, ఉపాధ్యా యులకు బోధనలో స్వేచ్ఛ లేకుండా చేస్తూ, బోధనతో పాటు బోధనేతర పనులు, పరిపాలనా పనుల ఒత్తిడులు పెరుగు తున్నాయి. ప్రయివేటు పాఠశాలలు మాత్రం పర్యవేక్షణకు దూరంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ”ప్రభుత్వ పాఠశాలలకే కఠిన పర్యవేక్షణ – ప్రయివేటు బడులకు మిన హాయింపు ఎందుకు?” అనే ప్రశ్నలు తల్లిదండ్రుల, విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం, ప్రయివేటు రెండింటిపైనా సమాన పర్యవేక్షణ వ్యవస్థ ఉండడంతోపాటు బోధనేతర పనులు అప్పగించకూడదని న్యాయస్థానాల సూచనలు ఉన్నప్ప టికీ ప్రభుత్వాలు అమలు జరపడం లేదు.పై అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు మాత్రమే విద్యానాణ్యత పెరుగుతుందని ప్రజా సంఘాలు, పేరెంట్‌ కమిటీలు సూచిస్తున్నాయి.

వాస్తవానికి, పర్యవేక్షణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించడం, ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయడం ద్వారా విద్యావ్యవస్థకు కొత్త ఊపువస్తుంది. ఇది నిరుద్యోగలకు ఉద్యోగావకాశాలు కల్పించడమే కాకుండా, పాఠశాలల నాణ్యతను పెంచే దిశలో సుస్థిర ఫలితాలు ఇస్తుంది.ఇప్పటికే ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ ఎంలు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున, కొత్త కమిటీల అవసరంపై కూడా పునరాలోచన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు బోధన, బోధనేతర పనులతో నిమగమై ఉన్న నేపథ్యంలో మరిన్ని పరిపాలనా బాధ్యతలు మోపడం విద్యార్థుల అభ్యాసంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు.అందువల్ల, ప్రభుత్వం ఈ నిర్ణ యాన్ని అమలు చేసేముందు విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష జరిపి సరైన విధానాన్ని అవలంబిస్తే అది విద్యానాణ్యతకు, విద్యార్థుల భవిష్యత్తుకు నిజమైన మేలు చేస్తుంది.

మేకిరి దామోదర్ల్‌
9573666650

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -