రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి : ఐఐటీహెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
విద్యా సంస్థలంటే.. జీవన వ్యవస్థలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ఉన్న మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ నాలుగో స్నాతకోత్సవం ఇండోర్ స్టేడియంలో సోమవారం గవర్నర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 22 మందికి పీహెచ్‌డీ పట్టాలు, 57 మందికి గోల్డ్ మెడల్స్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాటా ్లడుతూ.. విద్యారంగం, పరిశోధన, ఆవిష్కరణలు, సేవా కార్యకలాపాలతో మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయం అద్భుతమైన పురోగతి సాధిస్తోంద న్నారు. అడ్డంకులను అధిగమించి, బాధ్యతాయుత మైన, ఉత్పాదక, విజయవంతమైన పౌరులుగా తమ ను తాము మార్చుకుంటున్నారని తెలిపారు. విశ్వ విద్యాలయాన్ని జాతీయ స్థాయి విద్యా సంస్థగా తీర్చి దిద్దడంలో బలమైన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లను పెంపొందించడం కొనసాగించాలని, వారి మద్దతు ను ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థు లకు కొత్త సాంకేతికతలు అందించడం, ఉపాధి పెం పొందించడానికి.. పరిశ్రమల ఏర్పాటుకు.. కృత్రిమ మేధస్సును అందించేందుకు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రతి విశ్వవిద్యాలయం పరిశోధనలను ప్రోత్సహించాలని, ఇంజినీరింగ్ విభాగంలో చేయూ తనివ్వాలని హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ బీఎస్. మూర్తి చెప్పారు.
ప్రతి విద్యార్థీ చదివే సబ్జెక్టులో డిగ్రీతోపాటు తనకి ఇష్టమైన అంశంలో మరో డిగ్రీ సాధించాలని సూచించారు. నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం ఉపకులపతి ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఏడీసీ భవాని ప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్రపవార్, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ అమిత్, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ తొలి వీసీ ప్రొఫెసర్ గంగాధర్, పూర్వ రిజిస్టర్లు ప్రొఫెసర్ నరేందర్‌రెడ్డి ప్రొఫెసర్ ఉమేష్‌కుమార్, ఎంజీయూ రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి, అసిస్టెంట్ పరీక్షల నియంత్రణ అధికారి లక్ష్మీప్రభ సంధ్యారాణి, ప్రవళ్లిక, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, ఐక్యుఏసీ డైరెక్టర్ డాక్టర్ మిర్యాల రమేష్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.మద్దిలేటి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాసంస్థలు జీవన వ్యవస్థలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES