నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఓ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేస్తున్న వూదెపు వెంకట రామారావు, ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.1,90,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన తెలంగాణ దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, యాదగిరిగుట్ట ఆలయంలో ఫుడ్ మెషీన్లను ఏర్పాటు చేసిన పనులకు సంబంధించి రూ.11,50,445 బిల్లును ప్రాసెస్ చేసేందుకు, కాంట్రాక్టర్‌ను ఈఈ వెంకట రామారావు రూ.1.90 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, వెంకట రామారావు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఈఈ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



