దౌత్యం, చర్చలనే సమస్యను పరిష్కరించుకోవాలి : లోక్‌సభలో ప్రధాని మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దౌత్యపరమైన అంశంలో భారత్ స్పష్టంగా ఉందని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దౌత్యం, చర్చలనే సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితిపై మోడీ సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. యుద్ధం నుంచి ఉద్భవించే పరిస్థితులకు ఛానళ్లు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఆ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐక్యంగా ఉండడంతో పాటు సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితిని కొందరు అడ్వాన్‌టేజ్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని, అందుకే శాంతి భద్రతలను సరైన రీతిలో మానిటర్ చేయాలని చెప్పారు. గత దశాబ్దం కాలం నుంచి ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రాధాన్యత ఇచ్చామని, దీనిలో భాగంగా ముడి చమురు స్టోరేజీని పెంచామని అన్నారు. భారత్ వద్ద ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నుల స్ట్రాటజిక్ రిజర్వ్ పెట్రోల్ ఉందని ప్రధాని వెల్లడించారు. ఇది ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న రిజర్వ్‌లకు సంబంధం లేనిదని ఆయన తెలిపారు. గడిచిన 11 ఏండ్ల కాలంలో రిఫైనరీ కేపాసిటీ కూడా పెంచుకున్నామని తెలిపారు. వ్యవసాయంపై కూడా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడుతుందని, అయినా ప్రభుత్వం కావాల్సినంత ఫెర్టిలైజర్‌ను సమకూర్చుతోందని అన్నారు. రైతులపై కోవిడ్ లాంటి పరిస్థితుల ప్రభావం పడకుండా చూస్తున్నామని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నా లు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. పశ్చిమా సియాలో యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇప్పటి వరకు 3.75 లక్షల మంది భారతీయులు తిరిగి వచ్చినట్టు చెప్పారు. కేవలం ఇరాన్ నుంచి 1000 మంది భారతీయులు సురక్షితంగా వచ్చినట్టు వెల్లడించారు. దీంట్లో ఎంబీబీఎస్ చదువుతున్న 700 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. పశ్చిమా సియా ప్రభావాన్ని తగ్గించేందుకు స్వల్ప కాలిక, మధ్యశ్రేణి, దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు.యుద్ధం జరుగుతున్న పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనాకరంగా ఉన్నట్టు ప్రధాని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం పట్ల భారత పార్లమెంట్ ఒకే స్వరాన్ని వినిపించాలన్నారు. ఆ సంక్షోభం మొదలై మూడు వారాలు దాటిందని, ఆ ప్రభావం ప్రతి ఒక్కరిపై చూపుతోందని, యుద్ధం జరుగుతున్న దేశాలతో భారత్‌కు కీలకమైన వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు ఆయన చెప్పారు. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోలియం రిజర్వ్‌లు ఉన్నాయని, ఇథనాల్ బ్లెండింగ్ వల్ల గతంతో పోలిస్తే భారత్ సుమారు 4.5 కోట్ల బ్యారళ్ల ఇంధనాన్ని తక్కువగా దిగుమతి చేసుకుంటోందని మోడీ తెలిపారు.
ఉద్రిక్తతలు తగ్గించేందుకు యత్నం
- Advertisement -
- Advertisement -



