రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించాం
పారదర్శకత కోసం సైన్ బోర్డు ఏర్పాటు
మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు
మధ్యాహ్నభోజన పథకంలో చేపల ఆహారంపై సీఎంతో చర్చించి ముందుకెళ్తాం : రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామనీ, ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో రూ.123 కోట్లు కేటాయించామని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్సశాఖ క్రియాశీలంగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకంలో చేపల ఆహారం అమలయ్యేలా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీనిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో వరల్డ్ ఆక్వా కల్చర్ ఇండియా-2025 కాన్ఫరెన్స్ నిర్వహించారు. మత్స్య శాఖపై రూపొందించిన పాటను మంత్రి శ్రీహరి విడుదల చేశారు. స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మత్స్యకారుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో ముదిరాజ్ బిడ్డకు మత్స్సశాఖ మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. గతంలో నిర్వీర్యానికి గురైన మత్స్య శాఖను పునర్నిర్మాణం చేస్తూ ముందుకెళ్తున్నానని తెలిపారు. మత్స్యకారులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉండటమే కాకుండా గొలుసు కట్టు చెరువు లు ఒక గొప్ప వరమనీ, ఆ నీటి వనరులు మత్స్య సంపదకు ఎంతగానో దోహదపడుతున్నాయని వివరించారు. తెలంగాణలోని దాదాపు 26వేల నీటి వనరుల్లో చేప పిల్లల పంపిణీ చేస్తున్నామనీ, వాటిల్లో 84 కోట్ల చేప పిల్లలు,10 కోట్ల రొయ్య పిల్లలను విడు దల చేస్తున్నామని తెలిపారు. చేపపిల్లల పంపిణీ సంబధించిన వివరాలు తెలియజేస్తూ చెరువు వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. కార్య క్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్, తెలంగాణ ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, ఎన్‌ఎఫ్ డీబీ సీఈఓ బెహరా, సంయుక్త కార్యదర్శి నీతు కుమారి, జారుకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐకార్, పీవీఎన్‌ఆర్ వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్ఞానప్రకాష్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల అభివృద్ధికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



