Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలి

నూతన సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలి

- Advertisement -

ఏపీడి మధుసూదన్..
నవతెలంగాణ – రెంజల్

మార్చి 15 లోపు ఐకెపి ద్వారా అందించిన రుణాలను 98% రికవరీ చేయాలని వివో ఏ లను, సీసీలకు ఏపీ డి మధుసూదన్ ఆదేశించారు. శనివారం రెంజల్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో సిసి లకు, వివో ఏలకు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార మిషనరీలకు సంబంధించిన 20 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి 35 శాతం సబ్సిడీ కింద రుణాలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఐకెపిలో రుణాలను పొందిన డ్వాక్రా గ్రూప్ మహిళల నుంచి మార్చి 15 లోపు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలను రికవరీ చేయాలని ఆదేశించారు. వీటితోపాటు, నూతన సంఘాలను ఏర్పాటు, అదనంగా కిషోర్ బాలికలు, వికలాంగుల గ్రూపులను తయారు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎం రాందాస్, ఏపిఎం మోహన్, సీసీలు భాస్కర్, శివకుమార్, శ్యామల, పోశెట్టి, మండలంలోని వివోఏలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -