ప్రజల పట్ల పోలీసులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్
నవతెలంగాణ – పాలకుర్తి
పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు కృషి చేయాలని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ సూచించారు. శుక్రవారం పాలకుర్తి పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రజల పట్ల పోలీసులు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఇంకుడు గుంతను, లాన్ గ్రాస్ గార్డెన్ ఏర్పాటు చేయడం పట్ల సిఐ వంగాల జానకిరామ్ రెడ్డిని, ఎస్సై దూలం పవన్ కుమార్ లను అభినందించారు. పోలీసులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇలాంటి గొడవలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసిపి అంబటి నర్సయ్య, ఎస్సైలు మేకల లింగారెడ్డి, ఎండి యాకూబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES