మాజీ గవర్నర్ బండార్ దత్తాత్రేయ
నవతెలంగాణ-ముషీరాబాద్
బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జీవో జారీ చేసిందని, దాన్ని కేంద్రంలో తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా తాను కృషి చేస్తానని మాజీ గవర్నర్ బండార్ దత్తాత్రేయ అన్నారు. బీసీల న్యాయమైన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సం ఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ శని వారం 24గంటల నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హర్యా నా మాజీ గవర్నర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రజా ఉద్యమం అవసరమన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పటికీ చట్టం ముందుం టుందని, చట్టంలోని పెద్దలు రాజ్యాంగంలో ఉన్న ఏమైనా మార్పులు చేయాలంటే పార్లమెంట్‌కు అధికారం ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ మధు సూదనాచారి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికార మార్పిడి జరిగింది కానీ బీసీలకు ఆ అధికారంలో భాగస్వామ్యం రాలేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ల సాధనకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, సినీ నటుడు జైహింద్ గౌడ్, పలు బీసీ కుల సంఘాల నాయకులు దీక్షకు మద్దతు తెలిపారు.
బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేందుకు కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



