Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాడి ఆవు దాడి.. వృద్దుడు మృతి

పాడి ఆవు దాడి.. వృద్దుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
వ్యవసాయ బావి వద్ద పాడి ఆవు పొడిచి వృద్దుడు మృతి చెందిన సంఘటన హుస్నాబాద్ మండలంలోని మాలపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సొల్లు రాజయ్య (75) వ్యవసాయ బావి వద్ద పశువులను మేపుతుండగా ఆకస్మాత్తుగా పాడి ఆవు మీదకు వచ్చి ముందు భాగంలో పొడిచింది. దీంతో తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు 108 కు సమాచారం అందించి రాజయ్య ను హుస్నాబాద్ ఆస్పత్రి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -