Wednesday, November 26, 2025
E-PAPER
Homeజిల్లాలుతలకొండపల్లిలో సిఐటియు కన్వీనింగ్ కమిటీ ఎన్నిక 

తలకొండపల్లిలో సిఐటియు కన్వీనింగ్ కమిటీ ఎన్నిక 

- Advertisement -

నవతెలంగాణ తలకొండపల్లి జనరల్ బాడీ సమావేశం, సిఐటియు తలకొండపల్లి మండలం కన్వీనర్ గా ఎం. నరసింహ ను, 15 మంది సభ్యులతో కమిటీ ఎన్నిక ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రామ్మోహన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్ హాజరై ఎన్నుకోవడం జరిగింది.  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రుద్రకుమార్ మాట్లాడుతూ ఈనెల 10, 11 లో కాటేదాన్ ప్రాంతంలో జరిగే సిఐటియు మహాసభలు విజయవంతం చేయాలని,  కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడలు వెనుకకు తీసుకోవాలని కార్మికులకు ఈఎస్ఐ పీఎఫ్ లాంటి వర్తింపజేయాలని.అనేక సంవత్సరాలు నుంచి కార్మికులు పనిచేస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదు ఉద్యోగ భద్రత ఇవ్వాలని పర్మెంటు చేయాలని అనేక సమస్యల పైన ఈ మహాసభ ఉంటుందని అందరూ మహాసభకు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహకార దర్శి రామ్మోహన్,  సిఐటి జిల్లా కమిటీ సభ్యుడు జే పెంటయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చైతన్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -