Tuesday, September 23, 2025
E-PAPER
Homeవరంగల్ఎస్సీ,ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ నూతన కమిటి ఎన్నిక

ఎస్సీ,ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ నూతన కమిటి ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – మహాముత్తారం : మండల కేంద్రంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర డాకు నాయక్ ఆద్వర్యంలో మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారుగా అజ్మీర డాకునాయక్‌, అధ్యక్షులుగా గోక సదానందం, ప్రధాన కార్యదర్శిగా రొడ్డ సురేష్, ఉపాధ్యక్షులుగా తోట కృష్ణ, గంధం రాజేష్, కార్యదర్శిగా చిడెం రవీందర్, కోశాధికారిగా పంతకాని సూర్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోక సదానందం మాట్లాడుతూ.. మండలంలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల నివేషన స్థలాలతో పాటు ఇండ్ల మంజూరి కోసం పాటుపడతానని అన్నారు. తనపై నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -