సిద్దిపేట జిల్లా హిందూ వాహిని జిల్లా కమిటీని రాష్ట్ర శాఖ సూచన మేరకు ఎన్నుకొన్నట్లు జిల్లా అధ్యక్షుడు బస్వరాజు సత్యం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఉపాధ్యక్షుడిగా బండి కిరణ్ కుమార్, జిల్లా సమాచార సేకరణ అర్జున్ , జిల్లా ప్రచార ప్రముఖ ఎస్ ప్రశాంత్, జిల్లా మహిళా ప్రముఖ బండి దీప, జిల్లా యువ వాహిని శివప్రసాద్, జిల్లా ఆర్థిక ప్రముఖ పరశురాములు, జిల్లా అడ్వకేట్ ప్రముఖ ప్రదీప్ కుమార్, జిల్లా సంపర్క ప్రముఖ డి రాజు, జిల్లా అధ్యాపక్ పుల్లూరు రవి, కార్యాలయ ప్రముఖ శ్రీకాంత్, మహిళా టోలి మెంబర్ గా ప్రవళిక, అక్షయ్ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివాజీ గణేష్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ పొన్నాల శివ, జోనల్ ఇంచార్జ్ సత్యం పాల్గొన్నారు.