నవతెలంగాణ – ఆర్మూర్
విశ్వబ్రాహ్మణ సంఘం, శ్రీరామ కాలనీ- ఆర్టిసి కాలనీ, పెర్కిట్ నూతన కార్యవర్గం 2025- 27 కొరకు ఆదివారం ఎన్నికలు నిర్వహించినారు. పట్టణం లోని శ్రీరామ కాలనీ విశ్వబ్రాహ్మణ సంఘ భవనం లో నిర్వహించిన సర్వ సభ్యసమవేశంలో
అధ్యక్షులుగాశ్రీ మాన్పూర్ సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా వొద్దోజి శ్రీకాంత్ , కోశాధికారిగా సుంకం రవికుమార్ గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించిన మంచిర్యాల రమేష్ ,ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించిన వొద్దోజి గంగామోహన్ గార్లను మరియు నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరిగింది అధ్యక్షులు మాట్లాడుతూ.. 2013 పదకొండు సభ్యులతో స్థాపించిన ఈ సంఘం ఎపుడు 51 కి చేరిందని, దీనిని త్వరలో 100 మంది సభ్యులకు చేర్చుతానని , విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు వారి అభివృద్ధికి కృషి చేస్తానని,సంఘం అభివృద్ధిలో తన వంతు పాత్ర ఉంటుందని, తనపై ఉంచిన ఈ బాధ్యతకు సంఘ సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES