నవతెలంగాణ – జన్నారం: మండల కేంద్రంలో ఉన్న సీతారామ చంద్రస్వామి ఆలయ ట్రస్ట్ తరుపున ట్రస్ట్ చైర్మన్ మిక్కిలినేని రాజశేఖర్ ప్రతిపాదన మేరకు ఆలయ తాత్కాలిక అభివృద్ధి కమిటిని బుధవారం ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్ గా ఎంఆర్ నర్సింగరావు, సభ్యులుగా గుండ సుధాకర్, మచినేని మోహన రావు, వేగే రామకృష్ణ, గోలి రాము, గోలి చందు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ .. భూ దాతల, గుడి మొదటి ప్రతిష్టాపనలు, 2003 సంవత్సరంలో జరిగిన పున ప్రతిష్టాపనలు, 2022సంవత్సరంలో జరిగిన పున నిర్మాణం నవగ్రహ, అనుబంధ దేవాలయం ప్రతిష్టపకుల విరాళాల రూపంలో మరే రూంలో గాని సహాయం అందించిన వ్యక్తులు తగిన ఆధారాలు సమర్పించిన యేడల వారి పేర్లను శిలాఫలకాలపై వ్రాయించుట కొరకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇట్టి ఆలయానికి ట్రస్టు చైర్మన్ గా కొత్తగా సేవలందించడానికి ఎవరైనా ఉంటే వారి పేర్లను తెలపాలన్నారు. అట్టి వ్యక్తులు పోనకల్ గ్రామ వాసియై ఉండి హిందు సాంసృతి సంప్రదాయాలు గౌరవించే వ్యక్తులై ఉండవలేన్నారు. అన్నింటిని పరిగణలోకి తీసుకుని ప్రస్తుత కమిటి మరియు పొనకల్ గ్రామ ప్రజలు, ఆలయానికి విరాళానికి ఇచ్చిన వ్యక్తుల తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.