- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జెడ్ పి హెచ్ ఎస్ జుక్కల్ నందు టీఎస్ సీ పి ఎస్ఈ యు జుక్కల్ అధ్యక్షులుగా సునీల్, ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్, కోశాధికారిగా సాయిలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. ఈనెల 23న జరిగే సభకు ఉద్యోగులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం వల్ల ఉద్యోగులు పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందలేకపోతున్నారని, ఉద్యోగికి ఏమైనా అనుకోరానిది జరిగితే కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఉందని, కాబట్టి కంట్రీబుటరి పెన్షన్ స్కీము రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.
- Advertisement -



