నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధానిలోని 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎగురవేయనున్నారు. ఈ ఏడాది ‘వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, వికసిత్ భారత్@2047 కోసం యువశక్తి’ థీమ్‌లతో వేడుకలు జరపనున్నారు.
జ్ఞానపథ్‌లో వందేమాతరం ఆకృతిలో 2,500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు కూర్చోనున్నారు. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన దాదాపు 5 వేల మందికి అధికారులు ప్రత్యేక ఆహ్వానం పంపారు.
మరోవైపు, పర్యాటకుల సౌకర్యార్థం ఉచిత మెట్రో ప్రయాణం, క్యూఆర్ కోడ్ ఈ-ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. వేడుకలు ముగిసిన వెంటనే ఎర్రకోట పరిసరాల్లో చెత్త తొలగింపు కోసం ‘స్వచ్ఛత ప్రచారం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.



