- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గ పరిధి మండలంలోని పెద్దతుండ్ల గ్రామానికి చెందిన బియ్యని లక్ష్మి అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో బాధపడుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇటీవల రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి లక్ష్మీ చికిత్స ఖర్చుల కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి మంజూరు చేయించారు. గురువారం మంత్రి ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏఓసి అందజేశారు. ఏల్ఓసి మంజూరు చేయించి బాధితురాలకు అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబుకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -



