– మూడు గేట్లు ఎత్తివేత
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్టు రింగ్‌బండ్‌కు జలకళ సంతరించుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 2024లో కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగి శిథిలమైంది. అనంతరం రింగ్‌బండ్‌ను నిర్మించారు. చాలా కాలం తర్వాత ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రింగ్బండ్లోకి వరద నీరు చేరుతోంది.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు అశ్వారావుపేటలో 48.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇదే అత్యధిక వర్షపాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
నీటి పరిస్థితి ఇలా..
పెద్దవాగు ప్రాజెక్టు సాధారణ నిల్వ సామర్థ్యం – 0.558 టీఎంసీలు
ప్రస్తుత రింగ్‌బండ్ నిల్వ సామర్థ్యం – 0.17 టీఎంసీలు
ప్రస్తుతం రింగ్బండ్లోకి వస్తున్న వరద – 6,700 క్యూసెక్కులు
మూడు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్న నీరు – 6,600 క్యూసెక్కులు
రింగ్బండ్లోకి వస్తున్న వరద ప్రవాహానికి అనుగుణంగా మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఐబీ ఏఈ రియాజ్ తెలిపారు. వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.



