- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
గత వారం రోజులుగా మండుతున్న ఎండలు, దీనికి తోడుగా అప్రకటిత విద్యుత్ కోతలతో మండలంలో జనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో బుధవారం మధ్యాహ్నం కురిసిన అకాల కుండ పోత వర్షంతో వాతావరణం ఒకేసారి చల్లబడింది. దీంతో జనం ఊపిరి పీల్చుకోవడమే కాక పత్తి, వరి, మిర్చి తదితర పంటలకు జీవం పోసినట్లుగా అయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



