- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
చిన్నపాటి వర్షాలకే పట్టణంలోని గ్రంథాలయం రోడ్డంతా బురదమయంగా మారుతోంది. స్థానిక ప్రజలు తపాల కార్యాలయానికి, వివిధ పనుల నిమిత్తం వెళ్లాలంటే ఈ దారి గుండా వెళ్లాల్సిందే. ఆసరా పెన్షన్ కోసం ఆలేరు పోస్టాఫీస్‌కు వచ్చే వృద్ధులు, వితంతువులకు, వికలాంగులు బురద రోడ్డుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ దారిలో వెళ్ళాలంటేనే ఎక్కడ జారి పడిపోతామోనని వృద్ధులు జంకుతున్నారు. ఎన్నికలప్పుడు ప్రజాప్రతినిధులు ఇల్లిల్లు తిరిగి ఓట్లడిగే నాయకులకు మా బాధలు కనిపించడం లేదా అని వృద్ధులు వాపోతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని స్తానికులు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -



