Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు

సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు

- Advertisement -

161 మంది లబ్ధిదారులకు రూ.44.15 లక్షల ఆర్థిక సాయం
నవతెలంగాణ-భీంగల్
 
నిరుపేద అనారోగ్య కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందేలా నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని 21 గ్రామాలకు చెందిన 161 మందికి రూ.44,69,000 విలువైన చెక్కులు మంజూరయ్యాయి.

ఈ మేరకు భీంగల్ పట్టణానికి చెందిన 30 మంది లబ్దిదారులకు రూ.9,48,500, పూరణి పేట్ లో 12 రూ.2,95,000, బెజ్జోరా లో 8మందికి 2,03,000, బాచన్ పల్లి నలుగురికి రూ.68,000, ముచ్కూర్ లో 14 మందికి రూ.3,55,500, లింగాపూర్ లో ఇద్దరికి రూ.50,000, పిప్రిలో ఏడుగురికి రూ.2,10,000, పల్లికొండలో ఏడుగురికి రూ.2,21,000, చెంగల్లో 19 మందికి రూ.3,95,500 చొప్పున సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరైంది.

అలాగే సికింద్రాపూర్ లో ఐదుగురికి రూ.1,41,500, బాబాపూర్ లో ముగ్గురికి రూ.86,000, కుప్కల్ లో ఆరుగురికి రూ.2,18,500, జాగీర్యాల్ లో నలుగురికి రూ. 1,09,000, బాబానగర్ లో ముగ్గురికి రూ.60,000, మెండోర లో 11 మందికి రూ.2,73,000, కారేపల్లి లో ఇద్దరికి రూ.33,000, తాళ్లపల్లి లో ఒకరికి రూ.38,500, రహత్నగర్ లో నలుగురికి రూ.80,500, రుప్లాతండా లో ఒకరికి రూ.18,000, బడా భీంగల్ లో 10 మందికి రూ.3,61,000, గోన్ గోపుల లో ఎనిమిది మందికి రూ.2,50,000 విలువైన చెక్కులు మంజూరయ్యాయి.

ఈ సందర్భంగా మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ ద్వారా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కావడానికి సహకరించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ కు, సాంక్షన్ చేసిన, ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం అందేలా స్థానికంగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -