Wednesday, September 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువ వికాసంపై నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేనా.?

యువ వికాసంపై నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేనా.?

- Advertisement -

నవంబరు 19 నుంచి పంపిణీ చేయాలని ఆదేశాలు
నవతెలంగాణ – మల్హర్ రావు

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం రాయితీ రుణాల విషయంలో ఎట్టకేలకు కదలిక మొదలైంది. 2024 మే నెలలో యువత దరఖాస్తులు చేసుకోగా,రెండేళ్లు గడిచినా ఒక్కరికీ అందించలేదు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించి, నవంబరు 19 నుంచి రుణాల పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ యువత ఆశలు ఫలించ నున్నాయని భావిస్తున్నారు.

2024లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఎంపిక పూర్తి చేసి ఏడాది కిందట జూన్ నెలలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో చెక్కులను అందించాలని హడావుడి చేశారు. ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎంపిక పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పలేదు. 2025 జూన్ 2 నుంచి అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. మంజూరైన యూనిట్ల మేరకు పత్రాలను అర్హులకు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. చివరి క్షణంలో రుణాల పంపిణీ వాయిదా పడింది. తాజా ప్రకటనతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.

రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం
మండలంలో పథకం కింద ఎంపికైన వారికి 70 శాతం నుంచి వంద శాతం రాయితీపై రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణం అందించాల్సి ఉంది. ఈ మేరకు మండలంలో 15 గ్రామాల నుంచి అధికారులు 2,456 దరఖాస్తులు స్వీకరించారు.లక్ష లోపు అర్హులను గుర్తించిన అధికారులు రుణాలు అందించాల్సి ఉండగా ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -