Wednesday, September 23, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పార్టీ (బి)లో కర్ర వినాయకుని శోభయాత్ర 

పార్టీ (బి)లో కర్ర వినాయకుని శోభయాత్ర 

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పార్డి (బి )లో కొలువుదిరిన గణనాథుల శోభయాత్రను బుధవారం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్దాభక్తితో స్వామి వారికి విశేష పూజ కార్యక్రమాలు చేశారు. నిమజ్జనంలో భాగంగా గణేష్ విగ్రహలను రంగురంగుల అలంకారంతో చేసిన రథాల్లో గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా శోభ యాత్ర నిర్వహించారు. అదేవిదంగా తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు వేలంపాట వేయగా.. గ్రామానికి చెందిన ఇర్ల రాజేశ్వర్ రూ.48 వేలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు చిమ్మన్ పోశెట్టి, తూము శంకర్ రాజేశ్వర్, సురేష్ బాబు మోహన్ రాజన్న, రమేష్, కుల సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -