రేపు జరిగే ధర్నాను విజయవంతం చేయాలి..
సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం రమణ
నవతెలంగాణ తంగళ్ళపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావచ్చున ఇప్పటివరకు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం రమణ మండిపడ్డారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు గ్యారంటీలను పథకాలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుందన్నారు.
ప్రజల హామీలను నెరవేర్చుకునే దిశగా సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన కలెక్టరేట్ మహాధర్నాను కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల అధ్యక్షులు రమేష్ చంద్ర, కుడికాల కనకయ్య, కోడం వేణు, మర్కటి నరసయ్య, మూషం శంకర్, అక్కల శ్రీనివాస్, హరిదాసు, రాంనారాయణ పాల్గొన్నారు.