Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి: సీఐటీయూ

ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ-బాన్సువాడ (నసురుల్లాబాద్)
ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం బాన్సువాడ ఎమ్మెల్యే  పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగృహంకు తరలి వెళ్లారు. అదే సమయానికి ఎమ్మెల్యే వర్ని ప్రోగ్రాం వేయడంతో ఎమ్మెల్యే కుమారుడు డిసిసిబి చైర్మన్ మాజీ పోచారం భాస్కర్ రెడ్డికి ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్స్ వినతి పత్రం అందజేశారు. మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. తప్పకుండా నాన్నకు చెప్పి అసెంబ్లీలో మాట్లాడిపిస్తాను అని చెప్పారు.

ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు జె రవీందర్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు గత రెండు నెలలుగా జీతాలు లేవని, దీంతో ఆర్థికంగా వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే వారికి జీతాలు వచ్చే విధంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్, ఖర్చులు రూ.50,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ఆశా వర్కర్లు రాష్ట్ర కమిటీచలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ సమావేశాలకు తప్పకుండా ఆశా వర్కర్లు అందరూ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి పల్లవి, సుమలత, విజయ, స్వరూప, కవిత, సుచిత్ర, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -