Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్నికల సిబ్బంది రెమ్యునరేషన్‌ పెంచాలి

ఎన్నికల సిబ్బంది రెమ్యునరేషన్‌ పెంచాలి

- Advertisement -

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌కు టీఎస్‌సీపీఎస్‌ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నిల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి రెమ్యునరేషన్‌ను పెంచాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదినితోపాటు కార్యదర్శి లింగ్యా నాయక్‌ను టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు నరేందర్‌రావులు కలిసి వినతిపత్రం అందజేశారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో పీఓ, ఏపీఓతోపాటు పోలింగ్‌ సిబ్బందికి 2023లో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం రెమ్యునరేషన్‌ తక్కువగా ఇవ్వడం సరైంది కాదని తెలిపారు. వాటిని సమీక్ష చేసి, రెండు రోజుల శిక్షణ, రెండు రోజుల పోలింగ్‌ విధులు చేసిన పీఓలకు రూ.నాలుగు వేలు, అదేవిధంగా ఏపీఓలకు రూ.రెండు వేలు రెమ్యునరేషన్‌ ఇవ్వాలని కోరారు. ఇకముందు జరిగే ఎన్నికల కేంద్రాల్లో మహిళ ఉద్యోగ, ఉపాధ్యాయిలకు సరైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారనీ, సంబంధిత శాఖకు సమీక్ష కోసం పంపిస్తామని హామీ ఇచ్చారని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -