Tuesday, July 8, 2025
E-PAPER
Homeసినిమాషెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరగాలి

షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరగాలి

- Advertisement -

ఈ జూలైతో తెలుగు ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు ఎన్నుకున్న ప్రస్తుత కమిటీ గడువు ముగుస్తుంది. నిబంధనల ప్రకారం వెంటనే ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి. కానీ ఈ అసోసియేషన్‌లోని కొందరు వ్యక్తులు స్వార్థంతో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్‌ బై లా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలంటూ సోమవారం నిర్మాతలు డా.ప్రతాని రామకష్ణ గౌడ్‌, బసిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిలింఛాంబర్‌లోని నాలుగు సెక్టార్స్‌ నుంచి దాదాపు 60 మంది నిర్మాతలు మెమొరాండం సమర్పించారు.
తెలుగు ఫిలింఛాంబర్‌లో ఇటీవల జరిగిన ఈసీ మీటింగ్‌లో ఎన్నికల వాయిదా అంశాన్ని ప్రతిపాదించారని, ఈసీ మీటింగ్‌కు రాని ఒక సభ్యుడు ప్రతిపాదించిన దానికి మిగతా వారు ఎలా ఒప్పుకుంటారని మెమొరాండం సమర్పించిన నిర్మాతలు నిలదీశారు.
అసోసియేషన్‌లోని సి కల్యాణ్‌, అశోక్‌ కుమార్‌, మోహన్‌ గౌడ్‌, రాందాస్‌ వంటి పెద్దలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించి ఎన్నికలు జరపాలని కోరారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎన్నికల వాయిదా వేస్తారు. అందుకు జనరల్‌ బాడీ మీటింగ్‌ నిర్వహించి దాదాపు నెల రోజుల ముందే తెలియజేయాలి. ఎన్నికల వాయిదా ప్రతిపాదనకు నొచ్చుకుని ఒకరిద్దరు నిర్మాతలు రాజీనామా చేశారు. వారికి బాసటగా ఉంటాం. చిత్రపురి కాలనీలో అవినీతి జరిగింది అనేది అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించే ఫ్లాట్స్‌ను తెలుగు ఫిలింఛాంబర్‌కు చెందిన పేద సినీ కార్మికులకు కేటాయించాలని మెమొరాండం సమర్పించిన నిర్మాతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -