రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

వరుణ్‌ తేజ్‌ హీరోగా, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘గాంఢవీధారి అర్జున’. చిత్ర యూనిట్‌ విదేశాల్లో శరవేగంగా సినిమా షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో నిమగమై ఉన్నారు. ఈ మూవీలో యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్‌ 25 భారీ ఎత్తున రిలీజ్‌ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మాత బి.వి.ఎస్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మిక్కి జె.మేయర్‌ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Spread the love