నయా సైన్స్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌

సాహస్‌, దీపికా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘7:11 పిఎమ్‌’. చైతు మాదాల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్ర టీజర్‌ని డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని లాంచ్‌ చేశారు. ‘ఏలియన్‌ ప్లానెట్‌ నుంచి మానవులు: ప్రాక్సిమా ఈవీ-12, 400 సంవత్సరాలలో భవిష్యత్తులో మానవుల మనుగడకు కీలకమైన సమాధానాల కోసం ‘హంసలదీవి’ అనే చిన్న ఇండియన్‌ టౌన్‌కి చేరుకుంటారు. అదే రోజున, టౌన్‌ని నాశనం చేయడానికి కొన్ని పరిణామాలు జరుగుతుంటాయి. హీరో తన చేతిలోని టైమర్‌ను 7:11 పీఎమ్‌లోపు డీయాక్టివేట్‌ ఏం జరుగుతుందే ఉత్కంఠని టీజర్‌లో చూపించారు. విజువల్స్‌, కథనం, సాంకేతిక నైపుణ్యంలో ఒక మాస్టర్‌ పీస్‌ అన్నట్లుగా టీజర్‌ గొప్పగా అందర్నీ ఆకట్టుకోవడం ఆనందంగా ఉందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిత్ర బృందం తెలిపింది.

Spread the love