– ఎంవీ యాక్ట్ 2019తో ఇబ్బందులు
– రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో డిపోల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ- విలేకరులు
విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి, వాటిని ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో డిపోల ఎదుట ధర్నా కార్మికులు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంవీ యాక్ట్ 2019, విద్యుత్ బస్సుల విధానం వల్ల ఆర్టీసీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ ఆపరేషన్ అన్నీ ఆర్టీసీనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకే ఇచ్చి సంస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్ నుంచి ప్రదర్శనగా వెళ్లి డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. దేవరకొండ, సూర్యాపేట ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు చేశారు. ఆర్టీసీలో ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు రీయింబర్స్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో డిపో ఎదుట ధర్నా చేశారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పు చేయాలని, జీసీసీ పద్ధతిని రద్దు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. విద్యుత్ బస్సులను ప్రయివేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేసి, ఆర్టీసీని బలోపేతం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ధర్నానుద్దేశించి సీఐటీయూ నాయకులు వైవి.రామారావు, ఎస్‌డబ్ల్యుఎఫ్ సీనియర్ నాయకులు ఎమ్.వి.ఎస్. నారాయణ మాట్లాడారు.
విద్యుత్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



