- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల పరధిలోని పంట పొలాల్లో తడి ఇప్పర్గా, సోనాల గ్రామ శివారు మధ్యలో మెయిన్ లైన్ కరెంటు కంబాలు ప్రమాదకరంగా చాలా రోజుల నుంచి వంగి ఉన్నాయి. అసలే ఇది వానాకలం.. ఈ సమయంలో ప్రమాదవశాత్తు భారీ వర్షానికి గాని, ఈదురు గాలులకు గాని వైర్లు తెగి, నేల మీద పడితే.. మనుషుల, పశువుల ప్రాణాలు పోయే ప్రమాదం లేకపోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ట్రాస్స్ కో అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు కోరుతున్నారు. ఇందులో భాగంగా ప్రమాదాలు జరగకుండా వెంటనే వంగిఉన్న కరెంటు స్థంభాలను సరిచేయాలని కోరుతున్నారు.
- Advertisement -