సుమారు అర్థగంట పాటు ఇబ్బందులు పడ్డ రోగులు
అప్రమత్తమై లిఫ్టు తెరిచిన సిబ్బంది
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆస్పత్రిలో లిఫ్ట్ మొరాయించింది. బుధవారం ఉదయం ఆసుపత్రిలో పై అంతస్తుల నుంచి రోగులు వారి బంధువులు లిఫ్ట్ లో కిందికి వస్తుండగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. దాదాపు 15 మంది లిఫ్ట్ లో ఉండడం, అది మధ్యలో ఆగిపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ, లిఫ్ట్ విభాగాలను పర్యవేక్షించాల్సిన సిబ్బంది లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. లిఫ్ట్ బాయ్ లు లేకుండానే లిఫ్ట్ లో ప్రయాణించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రోగులు ఆరోపించారు. రోగుల ఆర్తనాదాలతో అప్రమత్తమైన సిబ్బంది అష్ట కష్టాలు పడి లిఫ్ట్ ను తెరిచారు. ఆస్పత్రిలో లిఫ్ట్ ల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు కేటాయించిన మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. లిఫ్ట్ లో ఉన్నవారు అరగంట తర్వాత బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రిలో ఇన్ చార్జి పాలన ఉండడంతో అస్తవ్యస్తంగా మరిందని బంధువులు అంటున్నారు.
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మొరాయించిన లిఫ్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES