Thursday, January 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా రాయబార కార్యాలయం : ఫ్రాన్స్‌

గ్రీన్‌ల్యాండ్‌కు మద్దతుగా రాయబార కార్యాలయం : ఫ్రాన్స్‌

- Advertisement -

పారిస్‌ : గ్రీన్‌ల్యాండ్‌కి మద్దతుగా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు ఫ్రాన్స్‌ తెలిపింది. గ్రీన్‌ల్యాండ్‌కి మద్దతుగా ఫిబ్రవరి 6న అక్కడ తమ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీన్‌-నోయెల్‌ బారోట్‌ పేర్కొన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా నుండి పదేపదే వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ..ఆ దేశానికి మద్దతును ప్రకటించేందుకు ఇది ఒక నిర్దిష్ట చర్య కానుందని అన్నారు. సైన్యం జోక్యం చేసుకునే అవకాశం ఉందని సూచిస్తూ, గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఫ్రాన్స్‌ మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా పాలనకు, స్వాధీనంలో ఉండేందుకు, విలీనం కావడానికి గ్రీన్‌ల్యాండ్‌ ఇష్టపడదని అన్నారు. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) , యూరోపియన్‌ యూనియన్‌లో భాగమైన డెన్మార్క్‌ పరిధిలోనే ఉండాలని ఈ ద్వీపం ఎంచుకున్నట్టు స్పష్టం చేశారు.అమెరికా వ్యాఖ్యలు అసంబద్ధమైనవి అని పేర్కొంటూ.. ఒక నాటో సభ్యుడు మరోకరిపై దాడి చేయడంలో అర్థం లేదని అన్నారు. ఇటువంటి చర్య అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. అంతర్జాతీయ చట్టాలు తుంగలో తొక్కుతున్నారని, 2026 ప్రారంభంలో దేశాల మధ్య సంబంధాలను ఇప్పుడు బలమైన చట్టం నియంత్రిస్తోందని స్పష్టంగా చూపించాయని అన్నారు. అమెరికా ఒత్తిడి దృష్ట్యా డెన్మార్క్‌కు సంఘీభావాన్ని ప్రకటించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. ఇటీవలి రోజుల్లో ఫ్రాన్స్‌ అధికారులు తమ డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌ సహచరులతో చర్చలు జరిపారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -