Saturday, September 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగుల వివరాలు సేకరించాలి : బీసీ కమిషన్‌

ఉద్యోగుల వివరాలు సేకరించాలి : బీసీ కమిషన్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరించాలని ఆయా శాఖల అధికారులకు రాష్ట్ర బీసీ కమిషన్‌ సూచించింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని బీసీ కమిషన్‌ కార్యాలయంలో చైర్మెన్‌ జి నిరంజన్‌ అధ్యక్షతన కమిషన్‌ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఉద్యోగుల వివరాలు ఇంకా సమర్పించని ప్రభుత్వ కార్యదర్శులతో త్వరలోనే సమావేశమై సమీక్షించాలని నిర్ణయించింది. ప్రభుత్వంలోని అన్ని విభాగ అధిపతుల కార్యాలయాల్లో బీసీ సెల్‌ల ఏర్పాటుకు సిఫారసు చేయాలని ఆదేశించింది.కమిషన్‌ కార్యాలయంలో గ్రంథాలయాన్ని నెల రోజుల్లో ప్రారంభించాలని తీర్మానించింది. తెలంగాణ విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం విద్యుత్‌ సంస్థలలో రిజర్వేషన్ల అమలు, ఇతర సమస్యలపై సమర్పించిన వినతి పత్రాన్ని పలు అంశాలపై పరిశీలించింది. ఈ ఫిర్యాదులపై ప్రాథమిక నివేదికను ఆ సంస్థ నుండి కోరాలనీ, ఆ తర్వాత విద్యుత్‌ సంస్థల కార్యాలయాలను సందర్శించి, విచారణ జరపాలని కమిషన్‌ నిర్ణయించింది. సమావేశంలో కమిషన్‌ సభ్యులు రాపోలు జయప్రకాష్‌, తిరుమలగిరి సురేందర్‌, రంగు బాలలక్ష్మి, కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీ బాల మాయ దేవి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -