- Advertisement -
డిప్యూటీ సీఎంతో టీఎన్జీవోస్ సంఘం నేతల భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు. గురువారం టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, కోశాధికారి ఎం.సత్యనారాయణ గౌడ్, కోశాధికారి కస్తూరి వెంకటేశ్వర్లు భట్టిని కలిశారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యలను, డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఈ నెల 26 తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్టు భట్టి హామీ ఇచ్చినట్టు తెలిపారు.
- Advertisement -



