టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు
నవతెలంగాణ-పాపన్నపేట
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ యూనియన్ (టీజీఓ) రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల్లో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ.. ఉద్యోగులకు 42శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చి తెలంగాణ రెండవ పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని సమావేశంలో తీర్మానించినట్టు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన మేరకు ప్రభుత్వం మరియు ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం విధి విధానాలను వెంటనే అమలు పరచాలని కోరారు. రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్‌ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరణ చేయాలని అన్నారు. కొన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అద్దె వాహనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. 2025 సభ్యత్వ నమోదు కార్యక్రమం డిసెంబర్‌లోగా పూర్తి స్థాయిలో చేయాలని తెలిపారు. ఈ కార్యవర్గ సమావేశంలో అసోసియేట్ అధ్యక్షులు బి.శ్యామ్, కోశాధికారి ఎం.ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఏ.జగన్మోహన్ రావు, ఎస్. సహదేవ్, ఎం. రామకృష్ణ గౌడ్, ఎస్.నరహరి రావు, ప్రొ. జి. మల్లేశం, కార్యదర్శులు ఏ. పరమేశ్వర్ రెడ్డి, శ్రీమతి శిరీష, శ్రీనివాస్ రెడ్డి, డా.టి.హరికృష్ణ, పి శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు కె. కిరణ్ కుమార్, వి. సురేశ్, పబ్లిసిటీ సెక్రెటరీలు అస్నాల శ్రీనివాస్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు 42 శాతం ఫిిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES