నవతెలంగాణ – మద్నూర్
మండల పరిషత్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా ఎపిడి వామన్ రావు ఆధ్వర్యంలో ఈజీఎస్ పనులపై ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల ఏపీఓ పద్మ మాట్లాడుతూ.. మండలంలో ఈజీఎస్ పనులు 163, పిఆర్ పనులు 105, ఉపాధి హామీ పనుల ఎక్స్పెండిచర్ విలువ రూ.3 కోట్ల 86 లక్షల 52 వేల 18, మెటీరియల్ విలువ రూ.10 లక్షల 13,848 అని తెలిపారు. అదేవిధంగా పిఆర్ పనులు ఎక్స్పెండిచర్ విలువ రూ.2,67,000, మెటీరియల్ విలువ రూ. 4 కోట్ల 26 లక్షల 438, పనులు జరిగాయని తెలిపారు. గ్రామాల వారిగా జరిగిన ఉపాధి హామీ పనులపై ఏపీడి ఆధ్వర్యంలో సమీక్ష చేశారు. ఏ ఏ గ్రామాల్లో ఎలాంటి లోపాలు జరిగిన వాటి గురించి ఏపీడి ఆధ్వర్యంలో అధికారులు క్షణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రజా వేదిక కార్యక్రమంలో పి ఆర్ ఏ ఈ అరుణ్, మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య, ఉపాధి హామీ ఎపిఓ పద్మ, మండలంలోని గ్రామ కార్యదర్శి, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
మద్నూర్ లో ఉపాధి హామీ సామాజిక ప్రజావేదిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



