Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెట్విన్ ద్వారా ఉపాధి అవకాశాలు: కలెక్టర్

సెట్విన్ ద్వారా ఉపాధి అవకాశాలు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 
పది, ఇంటర్ చదువు తర్వాత విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందేందుకుగాను సెట్విన్ ఆధ్వర్యంలో వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్ విద్యార్థులకు మండలాల ప్రత్యేక అధికారులు, సంక్షేమ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకించి మహిళలకు ఉద్దేశించి బ్యూటిఫికేషన్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం ఆమె  జిల్లా అధికారులతో మాట్లాడుతూ..  సెట్విన్ ద్వారా కల్పించే వృత్తిపరమైన   కోర్సుల శిక్షణ లో భాగంగా  ఈనెల 4న నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని రామ్ నగర్  అల్పసంఖ్యాక వర్గాల రెసిడెన్షియల్ పాఠశాలలో  ప్రారంభిస్తున్నట్టు ఆమె తెలిపారు. సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులకు నామమాత్రపు ఫీజు చెల్లించి వలసి ఉంటుందని, ఎవరైనా ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న అతి పేద  విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహయం అందిస్తామని ఆమె వెల్లడించారు. సెట్విన్ ఇచ్చే శిక్షణ కోర్సులలో భాగంగా  సుమారు( 26) రకాల కోర్సులు ఉన్నాయని, వాటిలో కంప్యూటర్ కోర్సులు, మహిళలకు ఉద్దేశించిన ప్రత్యేక కోర్సులు, ఎడ్యుకేషన్ కోర్సులు, టెక్నికల్ కోర్సులు ఉన్నాయని తెలిపారు.

ఇవన్నీ 3 నుండి 6 నెలల స్వల్పకాల వ్యవధి శిక్షణ కార్యక్రమాలు  ఉంటాయని, వీటిలో శిక్షణ పొందడం ద్వారా 10, ఇంటర్మీడియట్ వంటి విద్య పూర్తయిన వెంటనే ఏదైనా రంగంలో ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుందని, శిక్షణ పొందిన వారికి సెట్విన్ ద్వారా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ శిక్షణా కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని చెప్పారు. జిల్లాలో ఉన్న  రెసిడెన్షియల్ కె జి బి వి  పాఠశాలల విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో  రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, చండూరు, దేవరకొండ ఆర్డిఓలు శ్రీదేవి, రమణారెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు.

ప్రజావాణిఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి 
ప్రజావాణిఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని చెప్పారు.

దీనివలన పిర్యాదుదారులకు మేలు కలుగుతుందని, ఎంతో దూరం నుండి సమస్యల పరిష్కారానికై ఫిర్యాదుదారులు నల్లగొండ జిల్లా కేంద్రానికి వస్తారని దీన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.  ప్రజావాణిలో మొత్తం ఫిర్యాదులు (90) రాగా, జిల్లా అధికారులకు (41)  రెవిన్యూ శాఖకు (49) వచ్చాయి. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, గృహ నిర్మాణ పిడి. రాజ్ కుమార్,దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి ,నల్గొండ ఆర్డీవో .వై అశోక్ రెడ్డి ,చండూర్ ఆర్డీవో శ్రీదేవి, అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులును స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -