నలుగురు మావోయిస్టులు మృతి
నవతెలంగాణ-చర్ల
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య శనివారం జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పోలీస్ ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లాలోని నైరుతి దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి సమాచారం ఆధారంగా భద్రతా దళాలు శోధన ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ సమయంలో శనివారం సాయంత్రం నుంచి భద్రతా దళాలకు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. రాత్రి ఎనిమిది వరకు శోధన ఆపరేషన్ కొనసాగగా.. ఘటనా స్థలం నుంచి నలుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఐఎన్‌ఎస్ ఏఎస్‌ఎస్‌ఎల్ ఆర్ రైఫిల్స్ సహా పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.
బీజాపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్
- Advertisement -
- Advertisement -