– ఉగ్రవాది హతం
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం నాడు భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లో కుల్గాంలోని అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో శుక్రవారం సాయంత్రం నుంచి భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను చేపట్టాయని, ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ఇప్పటి వరకు ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయని సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ విభాగం శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్), రాష్ట్రానికి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు (ఎస్‌ఒజి) బలగాలు పాల్గొన్నట్లు పోలీసు అధికారులు మరో ప్రకటనలో తెలిపాయి. వారం రోజుల్లో ఇది మూడో ఎన్‌కౌంటర్ కాగా ఇప్పటి వరకు పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముష్కరులతో సహా ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు హంతమొందించాయి.
కుల్గాంలో ఎన్‌కౌంటర్
- Advertisement -
- Advertisement -