మహిళా మావోయిస్టు సహా ఏడుగురు మృతి
జవాన్ మృతి, మరో జవాన్‌కు తీవ్రగాయాలు
నవతెలంగాణ-చర్ల
రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అబుజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో శుక్రవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టు సహా ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్టు పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా.. ఇప్పటికే అబుజ్‌మాడ్ అడవులను హస్తగతం చేసుకున్న పోలీసులు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా ఇరువురు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు (ఇద్దరు పురుషులు, మహిళ) మృతిచెందారు.
వీరిలో రూ.25 రివార్డు ఉన్న మావోయిస్టు నాయకుడు ప్రభాకర్ ఉన్నట్టు సమాచారం. సంఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. ఈ ఆపరేషన్ సమయంలో సీ-60 దళానికి చెందిన కానిస్టేబుల్ దీపక్ చిన్న మాడవి(38) తీవ్రంగా గాయపడ్డారు. హెలికాప్టర్ ద్వారా భమ్రగఢ్ సబ్-డిస్ట్రిక్ట్ ఆస్పత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మరో కానిస్టేబుల్.. కిష్టయ్యపల్లి నివాసి జోగా మాడవికి తూటా తగిలింది. అతన్ని హెలికాప్టర్ ద్వారా భమ్రగఢ్‌కు తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది. తదుపరి చికిత్స కోసం అతన్ని గడ్చిరోలికి తరలించనున్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అబుజ్‌మాడ్ అడవుల్లో ఎన్‌కౌంటర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



